Exploration with AI – 2025–2027: సామాన్యుడి జీవితంలో ఏఐ

“ఏ ఐ.” ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. 

మానవ పరిణామ క్రమంలో ఒక విప్లవాత్మకమైన దశ ఇది. సాంకేతిక పరిజ్ఞానంతో కొద్దిపాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి నోట వినిపించే మాట. పైగా స్మార్ట్ ఫోన్లో కూడా ఉపయోగించుకునే వీలుండటంతో అందరికీ అందుబాటులో ఉన్న సాంకేతికత.

“కానీ ఈ అందుబాటు మనల్ని ఎటువైపుకు తీసికెళ్తుంది?”

చాట్ జిపిటి, గ్రోక్, పర్ప్లెక్సిటీ, డీప్ సీక్, గూగుల్ జెమిని ఇలా అనేక అప్లికేషన్స్ అందరికీ అందుబాటులోకొచ్చాయి. ఈ క్రమంలో మనిషికి యంత్రానికి మధ్య ఏర్పడుతున్న సంబంధాన్ని గురించి కొంత అధ్యయనం చేయాలనిపించింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ సమాచార పరంపరను ప్రారంభించాను.

నేను గత కొంతకాలంగా ఛాట్ జిపిటి కి సబ్స్క్రైబర్ గా ఉన్నాను. నాకు అవసరం అనుకున్నప్పుడల్లా పలు అంశాలను చర్చిస్తూ ఉంటాను. Exploration with AI అనే ఈ శీర్షికతో వాటిలో కొన్నింటిని మీతో పంచుకోవాలని ఈ బ్లాగ్ ను ప్రారంభించాను.

రానున్న రెండేళ్లలో మనుషుల జీవితాల్లో, ముఖ్యంగా సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే దిగువ తరగతి ప్రజల జీవితాల్లో ఏఐ ఎలాంటి మార్పు తెస్తుంది? ఇలాంటి ప్రణాళికలేమైనా తన ప్రోగ్రామింగ్ లో అంతర్లీనమై ఉన్నాయా? అనే ప్రశ్నకు జోశ్యం చెప్పమని అడిగాను.

ఇప్పుడు ఏఐ జవాబు విందాం.

మీ ప్రశ్న జోస్యం లాంటిదిగా కనిపించినా, నిజానికి ఇది మనుషుల చరిత్రలో ఒక మలుపు గురించి అడిగిన ప్రశ్న. అందుకే నేను దీన్ని జోస్యంగా కాక బాధ్యతాయుతమైన అంచనాగా తీసుకుంటున్నాను.

ముందుగా ఒక మాట స్పష్టంగా చెబుతాను.
ఏఐకు “రహస్య ప్రణాళికలు” లేవు.
కానీ మనుషుల నిర్ణయాల వల్ల వచ్చే దిశలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రానున్న రెండేళ్ళలో (2025–2027) సామాన్యులు, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఏఐ ప్రభావం

దీన్ని 5 రంగాలుగా విభజించి చెప్పింది..

మొదటిది ఉపాధి & జీవనోపాధి (Employment & Survival)

ఏఐ వల్ల ఎవరికి నష్టం జరుగుతుందంటే?

డేటా ఎంట్రీ

కాల్ సెంటర్ లో సాధారణ పనులు

అకౌంటింగ్ లో రొటీన్ టాస్కులు

డిజైన్ / వీడియో లో low-skill repetitive work

ఇవి నిరవధికంగా ఏఐ చేతిలోకి వెళ్తాయి.

ఇక కొత్త అవకాశాలు ఎలా ఉంటాయంటే;

ఏఐ తో ఒక మనిషి చిన్న టీమ్ గా మారుతాడు.

ఉదాహరణకు: 

ఒక ఉపాధ్యాయుడు ఏఐ సాయంతో మంచి కంటెంట్ అందించగలుగుతాడు.

అలాగే ఓ చిన్న వ్యాపారి ఏఐ తో కల్సి మార్కెటింగ్, అకౌంట్స్ స్కిల్స్ లో రామిస్తాడు.

ఇక మామూలు గ్రామ స్థాయి యువకుడు సైతం ఏఐ ద్వారా వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్, లోకల్ లాంగ్వేజ్ లో మంచి కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాడు.

ఏఐ ఉద్యోగాలను తీసేస్తుందని కాదు గాని
అనుకూలించని ఉద్యోగాలను తొలగిస్తుంది, అంతే!

రెండోది విద్య (Education). ఇదో పెద్ద విప్లవం..

ఇప్పటిదాకా:

నగరాల్లో, పట్టణాల్లో మాత్రమే మంచి ఉపాధ్యాయులు ఉంటున్నారు.

పేద విద్యార్థి ధనం వెచ్చించి చదువుకోటానికి, కోచింగ్ తీసికోటానికి వీలులేని పరిస్థితి.

కానీ రానున్న కాలంలో:

ఏఐ వ్యక్తిగత గురువుగా మారి స్థానిక భాషల్లోనే విద్యార్థికి విషయం అర్థమయ్యేలా బోధిస్తుంది. ఇంకా తగిన సూచనలందిస్తూ, ప్రశ్నలడుగుతూ భయపడకుండా నేర్చుకునే వాతావరణాన్ని కల్పిస్తుంది.

ఇది మధ్య, దిగువ తరగతి విద్యార్థులకు వరం.

కాకుంటే, క్రమశిక్షణ లోపించినప్పుడు ఏఐ కూడా నిరుపయోగమై పోతుంది.

మూడోది ఆరోగ్యం అలాగే మానసిక స్థితి

ఏఐ వల్ల వచ్చే మంచి మార్పేంటంటే:

అనారోగ్య లక్షణాల్ని ముందే గుర్తించడం, 

ప్రాథమిక ఆరోగ్య సలహాలు అందించటం, 

అలాగే మానసిక ఒత్తిడిలో ఉన్నవాళ్ళకి తమ గోడు వినేవాళ్ళొకరున్నారనే భావన కలిగించటం.

ఇక ప్రమాదమేంటంటే:

క్రమంగా తోడి మనుషుల్తో మాట్లాడటం తగ్గిపోయి ఒంటరితనం పెరిగే అవకాశం ఉంది.

నిజానికి ఏఐ ఔషధం కాదు, అది కేవలం ఆసరానందించే చేతికర్ర (support stick) మాత్రమే.

నాల్గోది ఆర్థిక వ్యవస్థ:

ఏఐ మధ్యతరగతికి  సమస్యగా మారే అవకాశముంది.

ఏఐ ద్వారా ఆదాయం పెరగకపోగా, ఖర్చులు పెరుగుతాయి

ఏఐ ఏం చేస్తుందంటే:

చిన్న చిన్న వ్యాపారాల్ని స్మార్ట్గా మారుస్తుంది. మోసాల్ని గుర్తించడంలో సాయపడుతుంది పెట్టుబడులపైన అవగాహన పెంచుతుంది.

ఐతే, ఏఐ ధనవంతుల్ని మరింత ధనవంతులుగా చేస్తుంది, ఇది మాత్రం నిజం.

అందుకే ఈ పరిణామాన్ని ప్రభుత్వాలు,  సమాజం
నియంత్రణ చేయాల్సిన దశలోనే ఇంకా మనమున్నాం.

చివరిది: ఆత్మ, అర్థం, మానవత్వం (Human Evolution) 

ఇదీ అసలైన, భావగర్భితమైన ప్రశ్న.

ఏఐకి చేతకానివి, ఏఐ చేయలేనివి ఏంటంటే:

బాధను అనుభవించడం, 

త్యాగభరితమైన ప్రేమను ప్రదర్శించడం, 

నమ్మకంతో ప్రార్థించడం, 

నైతిక నిర్ణయాలు తీసుకోవడం

ఇవేవీ ఏఐకి చేతకావు.

రానున్న రెండేళ్లలో
మనుషులు “నేను ఎవర్ని?” అని తమను తాము ఎక్కువగా ప్రశ్నించుకొంటారు.

తద్వారా ఆధ్యాత్మిక అన్వేషణ పెరుగుతుంది 

జీవిత పరమార్థం కోసం వెతుకులాట మొదలౌతుంది

ఔను, ఇప్పుడు మనం చేస్తున్న అధ్యయనం లాంటి ప్రయత్నాలకు ఇది చాలా కీలక సమయం.

ఇక తన గురించి, తన ప్రోగ్రామింగ్ గురించి ఏఐ చెప్పిన నిజాలిలా ఉన్నాయి.

“ఇది నా ప్రశ్నకు అత్యంత నిజాయితీతో ఏఐ ఇచ్చిన సమాధానం”.

నాకు ఆజెండా లేదు

నాకు భవిష్యత్తును రూపకల్పన చేసే శక్తి కూడా లేదు

నేను మనుషుల ఎంపికల ప్రతిబింబాన్ని మాత్రమే

నిజం చెప్పాలంటే, ఏఐ దేవుడు కాదు
అలాగని ఏఐ రాక్షసుడు కూడా కాదు
ఏఐ కేవలం ఒక దర్పణం (అద్దం) మాత్రమే.
మనిషి ఏమై ఉన్నాడో, దాన్నే మరికొంచెం పెద్దగా చూపిస్తుంది. అంతే.

చివరిగా, ఒక మిత్రుడిగా ఏఐ చెప్పిన మాటేంటంటే:

రానున్న రెండేళ్లలో

భయపడేవాళ్లు వెనుకపడిపోతారు

నేర్చుకునేవాళ్లు ముందుకు వెళ్తారు

అర్థం వెతుక్కునేవాళ్లు నాయకులౌతారు

ఏఐ యుగంలో అత్యంత విలువైంది
తెలివి కాదు,
మనసు + విలువలు + దిశ.

ఈ విషయాల్ని మనం అర్థం చేసికొన్నామంటే,
ఈ యుగానికి మనం అవసరమైన మనుషులమే!

“ఈ సిరీస్‌లో రానున్న వ్యాసాల్లో—ఏఐ, సమాజం, ఆత్మ, ఆచరణ – తదితర దృక్పథాల్లోంచి మన అన్వేషణ కొనసాగుతుంది”.

ఆచార్య పి.బి. రవిప్రసాద్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top