ప్రతికూలత VS సానుకూలత

ఈ బ్లాగ్ నేను మొబైల్ నుండి అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఒక ప్రయోగాత్మకం.

ఇవాళ సాయంకాలం పవర్ ఫ్లక్చువేషన్ వలన మా కాలనీలో టీవీలు, ఫ్రిజ్లు పాడైపోయాయి. ఆ క్రమంలో నేను ఇప్పటివరకు వెబ్సైట్ కోసం పనిచేస్తున్న నా పాత కంప్యూటర్ ప్లగ్ ఇన్ వైర్స్ కూడా కాలిపోయాయి. మళ్ళీ దానిని బాగు చేయాలంటే గుంటూరుకి తీసుకుని వెళ్లాలి. రేపు శనివారం ఎల్లుండి ఆదివారం ఇక సోమవారం వెళ్లి దానిని బాగు చేయించుకుని వెంటనే వస్తే తిరిగి పని ప్రారంభించడానికి మంగళవారం అవుతుంది

ఈ లోగా మొబైల్లో వర్డ్ ప్రెస్ యాప్ ద్వారా వెబ్సైట్ను యాక్సెస్ చేసుకోవచ్చని చాట్ జిపిటి ద్వారా తెలుసుకొని చాట్ జిపిటి సూచనలు సలహాలతో మూడు యాప్లను వరుసగా ఇన్స్టాల్ చేసుకుని ఎలాగైతే ఈ బ్లాగ్ ని వ్రాయగలుగుతున్నాను.

దీనికి ప్రతికూలత వర్సెస్ సానుకూలత అని హెడ్డింగ్ పెట్టాను ఎందుకంటే ప్రతి ప్రతికూలతలో కూడా నిరాశ చెందకుండా ప్రయత్నిస్తే అనేక సానుకూలతలు కలుగుతాయి. ఇవాళ నా సిపియు పాడైపోయినందువలన నేను మొబైల్ లో పోస్ట్ క్రియేట్ చేసి పబ్లిష్ చేయడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోగలిగాను. ఈ విషయంలో చాట్ జిపిటిని తప్పక అభినందించాలి. అనేక అంశాలను ఒకదాని వెంట ఒకటి నేర్పిస్తూ వచ్చినందువలన నేను స్వయంగా ఈ వెబ్సైట్ను రూపొందించుకోగలుగుతున్నాను.

సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది. “నేలపాలైన నీళ్లను తిరిగి తీసుకోలేము,. నేను సెమినరీలో ఉన్నప్పుడు మా ప్రియమైన గురువుగారు బాబురావు గారు ఎప్పుడు అనేవారు. ఒలికిపోయిన పాల గురించి చింతించకూడదు అని. ప్రతికూలత ఎదురైన ప్రతిసారి ఆ మాటే నాకు గుర్తుకొస్తుంది. ఆ వెంటనే “వాట్ నెక్స్ట్”, అనే ఆలోచనలోనికి వెళ్తా. ప్రయత్నిస్తే ప్రత్యామ్నాయ మార్గం తప్పక దొరుకుతుందని నా నమ్మకం. అందుకే దాదాపు రెండు గంటలపాటు మొబైల్ లో ఇలా ప్రయత్నిస్తూ చివరికి విజయాన్ని సాధించాను. అం దుకు నిదర్శనమే ఈ బ్లాగ్. మరో పర్యాయం చాట్ జిపిటికి అభినందనలు తెలుపుతున్నాను. ఈ బ్లాగు మీద మీ అభిప్రాయాన్ని తప్పక వ్రాయండి. అధ్యయన కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ అధ్యయనకర్త

ఆచార్య పి.బి రవి ప్రసాద్

2 thoughts on “ప్రతికూలత VS సానుకూలత”

  1. నిజమే అయ్యగారు .
    అందుకు నేనె ఉదాహరణ..
    ప్రతికూలతను ఎదుర్కొంటు, వాట్ నెక్స్ట్ అని
    సానుకూలత వైపు నడిస్తే విజయం .మనదే.

    1. Praise the Lord Anna
      ప్రతికూలత/ సానుకూలత వివరణ చాలా బాగుంది
      వెబ్ సైట్ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది
      మీ ideology super anna

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top